*నల్గొండ ఎస్‌బీఐ లో భారీ చోరి*
నల్గొండ: రామగిరి రోడ్డులో ఉన్న ఎస్‌బీఐ బ్యాంక్‌లో భారీ చోరీ జరిగింది. అర్థరాత్రి తాళాలు పగులగొట్టి అగంతకులు లోపలకు ప్రవేశించారు. బీరువా, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. సోమవారం ఉదయం బ్యాంక్ మేనేజర్ చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీకెమెరా ఆధారంగా దొంగలను గుర్తించే పనిలో పడ్డారు. పూర్తి వివరాలు.. రాత్రి దీపావళి సంబరాలు జరుగుతుండగా.. మరోవైపు నల్గొండ క్లాక్‌టవర్ సెంటర్, రామగిరి రోడ్డులో ఉన్న ఎస్‌బీఐ బ్యాంక్‌లో చోరీకి ప్రయత్నం జరిగింది. అయితే బ్యాంక్‌లో ఏ మేరకు దొంగతనం జరిగిందన్నదానిపై స్పష్టత రాలేదు. కాగా బ్యాంక్ దోపిడీపై నల్గొండ పట్టణంలో కలకలం రేగుతోంది.